AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: ఏ క్షణంలోనైనా తెలంగాణ పీసీసీ చీఫ్ పేరు ప్రకటించే అవకాశం..!

Telangana PCC Chief: తెలంగాణ కాంగ్రెస్ పీపీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త పీసీసీ చీఫ్ పేరును ..

Big Breaking: ఏ క్షణంలోనైనా తెలంగాణ పీసీసీ చీఫ్ పేరు ప్రకటించే అవకాశం..!
Shiva Prajapati
|

Updated on: Jan 05, 2021 | 11:38 AM

Share

Telangana PCC Chief: తెలంగాణ కాంగ్రెస్ పీపీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త పీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టాన వర్గాల సమాచారం. టీపీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సామాజిక, ఆర్థిక, సంస్థాగత సమీకరణాలను బేరేజు వేసుకుని, ఆశావహుల తుది జాబితా నుంచి ఒకరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్‌తో పాటు ప్రచార కమటీ, సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సీనియర్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందరికీ ఆమోదయోగ్యుడు, అనుభవజ్ఞుడైన నేతకు పీసీసీ పట్టం కట్టబెట్టనుంది. అలాగే, పాపులారిటీ, జనంలో క్రేజ్ ఎక్కువున్న నేతకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:

SRSP: ఎస్సారెస్పీ కాలువకు గండి… భారీగా వస్తున్న నీరు… నీటమునిగిన సింగారం కాలనీ…

Central Vista: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇద్దరు న్యాయమూర్తులు అనుకూలం.. ఒకరు వ్యతిరేకం..