Minister Ajay: ఖమ్మం కార్పొరేషన్‌లో మంత్రి పర్యటన… సైకిల్‌ సవారి… సమస్యలకు పరిష్కారానికి ఆదేశాలు…

Minister Ajay: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం కార్పొరేషన్‌లో పర్యటించారు. సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను...

Minister Ajay: ఖమ్మం కార్పొరేషన్‌లో మంత్రి పర్యటన... సైకిల్‌ సవారి... సమస్యలకు పరిష్కారానికి ఆదేశాలు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 05, 2021 | 12:10 PM

Minister Ajay: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం కార్పొరేషన్‌లో పర్యటించారు. సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆయన వెంట మేయర్‌ పాపాలాల్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి పర్యటించారు.

కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించి, స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలోని చెత్త, తాగునీటి సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చెత్తను నిత్యం తొలగించాలని, ప్రతి రోజు డివిజన్లలో పారిశుధ్యంపై వాకబు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. పైపులైన్‌ పనులు జరుగుతున్నాయని, వెంటనే పనులు పూర్తి చేసి.. నీరందేలా చూస్తామన్నారు. పనుల్లో ఆలస్యం లేకుండా చూడాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.

Also Read: Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ… స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’…