AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol Tribhanga Trailer: ఆకట్టుకుంటోన్న కాజోల్‌ ‘త్రిభంగా’ ట్రైలర్‌.. మూడు తరాల మహిళల మధ్య జరిగే..

Kajol Tribhanga Trailer Out: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై రోజురోజుకీ ఆదరణ పెరుగుతోన్న తరుణంలో బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే...

Kajol Tribhanga Trailer: ఆకట్టుకుంటోన్న కాజోల్‌ 'త్రిభంగా' ట్రైలర్‌.. మూడు తరాల మహిళల మధ్య జరిగే..
Narender Vaitla
|

Updated on: Jan 05, 2021 | 12:22 PM

Share

Kajol Tribhanga Trailer Out: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై రోజురోజుకీ ఆదరణ పెరుగుతోన్న తరుణంలో బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్‌ యాక్టర్‌లు కూడా ఓటీటీ వేదికగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘త్రిభంగా’ పేరుతో ఓ సినిమా రానుంది. బాలీవుడ్‌ ప్రముఖ నటి కాజోల్‌ ఇందులో ప్రాధాన పాత్ర పోషిస్తుండగా.. ఆల్కేమీ ఫిలింస్‌తో కలిసి కాజోల్‌ భర్త అజయ్‌ దేవగణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. రేణుకా సహానే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హ్యూమన్‌ ఎమోషన్స్‌ను బాగా చూపించారు. ఇక ట్రైలర్‌ను గమనిస్తే.. మూడు తరాల మహిళల మధ్య చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనట్లు కనిపిస్తోంది. ఇక ఇందులో కాజోల్‌ అనురాధ ఆప్టే అనే పాత్రలో ఒడిస్సీ డ్యాన్సర్‌గా కనిపిస్తోంది. సరికొత్త కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

Also Read: Tiger Shroff and Disha Patani Dating : క్లారిటీ వచ్చేసింది..టైగర్‌, దిశాల రిలేషన్‌పై అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్