Telangana: రెండో రోజూ కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ఆధిక్యంలో ఎవరంటే..
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు రెండో రోజూ కూడా కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో 96వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం రెండో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. గత నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ లో 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి.

వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు రెండో రోజూ కూడా కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో 96వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం రెండో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. గత నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ లో 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లను నల్లగొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో లెక్కిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డితో సహా 52 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నిన్న ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో 25 చొప్పున ఓట్లను బండిల్స్ కట్టారు. ఆ తర్వాత 96 టేబుల్స్‌లో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. మొదటి రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 7,670 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొదటి రౌండు 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్)కు 36,210 ఓట్లు, ఏనుగుల రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్)కు 28540 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ)కు 11,395 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండు 96,000 మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెల్లినవి 88,369 కాగా, 7,728 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి అభ్యర్థుల గెలుపు కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతానికి పైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఫలితం.. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే ఈరోజు సాయంత్రం వరకు ఫలితం తేలే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి గెలుపు కోటాను చేరిన వారిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
