CM Revanth Tour: నేడు పాలమూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ.. వరాలు ప్రకటించనున్న సీఎం రేవంత్
పాలమూరు జిల్లాలో నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజాదీవెన సభ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్న తొలిసభ కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.

పాలమూరు జిల్లాలో నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజాదీవెన సభ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్న తొలిసభ కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.
ఎంపీ అభ్యర్థి ఖరారు
పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు జోరుందుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించడంతో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర ముగింపు సభకు ప్రజా దీవెన సభ నామకరణం చేశారు. సాయంత్రం 5గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లోని సభా వేదికకు చేరుకుంటారు. సభా ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన..?
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రజా దీవెన సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది జిల్లా కాంగ్రెస్. వేల సంఖ్యలో జనసమీకరణ లక్ష్యంతో సభను విజయవంతం చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జిల్లా కేంద్రానికి రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు ప్రజా దీవెన సభా వేదికగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటనే చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు విద్యాసంస్థల స్థాపనకు సంబంధించిన హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న సభ కానున్న నేపథ్యంలో పాలమూరు ప్రజా దీవెన సభా వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ నేతలు, ముఖ్య నాయకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




