CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యం.. విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి..!
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 నుంచి 19 వరకూ సింగపూర్‌లో పర్యటిస్తారు. స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. జనవరి 20 నుంచి 22 వరకూ దావోస్ టూర్ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
ముఖ్యమంత్రి వారంరోజుల సింగపూర్, దావోస్ టూర్‌కు వెళ్లనున్నారు. వరల్డ్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై వివరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రాధాన్యతపై వివరిస్తారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన ప్లాన్‌పై దావోస్ వేదికగా సీఎం రేవంత్ కీలక చర్చలు జరుపుతారు.
వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ పర్యటనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు సీఎం రేవంత్ హజరవుతున్నారు. కాంగ్రె్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతర్జాతీయ వేదికపై రెండోసారి ప్రసంగించనున్నారు సీఎం రేవంత్.
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 నుంచి 19 వరకూ సింగపూర్‌లో పర్యటిస్తారు. స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. జనవరి 20 నుంచి 22 వరకూ దావోస్ టూర్ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి టూర్ సాగనుంది. హైదరాబాద్‌కి ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత ఏడాది దావోస్ సదస్సులో కుదిరిన ఒప్పందాలతో 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. నాడు 14 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరో 10 ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దావోస్ టూర్ నేపథ్యంలో పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌తోపాటు ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌కి హాజరయ్యారు. అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ హైదరాబాద్‌ను ఎలా ప్రజెంట్ చేయాలనే దానిపై చర్చించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..