హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు.. రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేశారు న్యాయమూర్తి. దీంతో పాటు 25 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని కౌశిక్ రెడ్టి తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు.. రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి
Koushik Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 14, 2025 | 10:35 AM

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేశారు న్యాయమూర్తి. అయితే 25 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో దురుసుగా ప్రవర్తించారని కౌశిక్‌రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈక్రమంలో సోమవారం(జనవరి 13) రాత్రి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కౌశిక్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. ‌

అయితే కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని నేరుగా కరీంనగర్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు చేయించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని కౌశిక్ రెడ్టి తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బెయిల్‌పై విడుదలైన కౌశిక్ రెడ్డి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే వెళ్లిపోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపి, హైదరాబాద్ వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..