Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: పాలనలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. ప్రజల కోసం తగ్గేదీలే అంటున్న సీఎం

అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గరకే ప్రభుత్వాన్ని తీసుకెళతామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రజా పాలన ద్వారా అందే దరఖాస్తుల ద్వారా అసలైన లబ్దిదారుల లెక్క తెలుస్తుందని అన్నారు. అలాగే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: పాలనలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. ప్రజల కోసం తగ్గేదీలే అంటున్న సీఎం
Telangana Cm Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 30, 2023 | 5:42 PM

అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గరకే ప్రభుత్వాన్ని తీసుకెళతామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రజా పాలన ద్వారా అందే దరఖాస్తుల ద్వారా అసలైన లబ్దిదారుల లెక్క తెలుస్తుందని అన్నారు. అలాగే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.

‘ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని సీఎం సూచించారు. ‘ప్రజా పాలన’ దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 28 నుంచి ‘ప్రజా పాలన’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ‘ప్రజా పాలన’ దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజా పాలన’ క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సీఎం మరోసారి స్పష్టంగా సూచించారు.

ఇదిలావుంటే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్నదారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. శనివారం ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో KBR పార్క్‌ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్‌ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, CMగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్‌లో జనానికి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలోనూ మార్క్ చూపిస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ నెరవేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర సచివాలయానికి పిలపించుకుని రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చెక్‌ను శనివారం బాధిత కుటుంబానికి అందించారు.

మరోవైపు మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. అయితే ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని CM సూచించారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసిన నళిని.. ఉద్యోగం అవసరం లేదని సీఎంకు తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తాను రచించిన ఒక పుస్తకాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు నళిని.

ఇక రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున, అమల దంపతులు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…