AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముచ్చటైన సమాజానికి మూడు సూత్రాలు.. డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

డ్రగ్స్‌పై యుద్ధంలో తగ్గేదే లేదన్నారు..సీఎం రేవంత్‌రెడ్డి. పిల్లల్లో ఉత్సుకతతో మొదలై వ్యసనంగా మారుతున్న డ్రగ్స్‌ను నియంత్రించేందుకు..ఏ చర్యలు తీసుకోవాడానికైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ఫ్రీ సొసైటీ దిశగా అడుగులు వేసేందుకు..మూడు లైన్ల సూత్రం చెప్పారు. ముచ్చటైన సమాజానికి మూడులైన్ల సూత్రం అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనలో తల్లిదండ్రులు, సమాజంతో పాటు విద్యాసంస్థలు, పోలీసులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Telangana: ముచ్చటైన సమాజానికి మూడు సూత్రాలు.. డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Jul 14, 2024 | 6:21 AM

Share

డ్రగ్స్‌పై యుద్ధంలో తగ్గేదే లేదన్నారు..సీఎం రేవంత్‌రెడ్డి. పిల్లల్లో ఉత్సుకతతో మొదలై వ్యసనంగా మారుతున్న డ్రగ్స్‌ను నియంత్రించేందుకు..ఏ చర్యలు తీసుకోవాడానికైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ఫ్రీ సొసైటీ దిశగా అడుగులు వేసేందుకు..మూడు లైన్ల సూత్రం చెప్పారు. ముచ్చటైన సమాజానికి మూడులైన్ల సూత్రం అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనలో తల్లిదండ్రులు, సమాజంతో పాటు విద్యాసంస్థలు, పోలీసులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. JNTUలో జరిగిన స్టూడెంట్ వాలంట‌రీ పోలీసింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్‌ వాడకంపై ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవడం వల్లే.. సమాజంలో పలు సమస్యలు వస్తున్నాయన్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లు పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారని..సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెబుతారని..ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు డ్రగ్స్‌ వంటి బలహీనతలకు లొంగిపోతున్నారని చెప్పారు. డ్రగ్స్‌ నిర్మూలనకు విద్యాసంస్థలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం చాలా విద్యాసంస్థల్లో భారీగా ఫీజులు తీసుకుంటున్నారు గానీ..గొప్ప విద్యాబుద్దులు మాత్రం నేర్పడం లేదని విమర్శించారు. పాఠశాలలు క్లాస్‌రూమ్‌ సబ్జెట్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా..మోరల్‌ పోలిసింగ్‌ కూడా నేర్పించాలన్నారు. పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులను గమనించేందుకు..ప్రతి స్కూల్‌లో మానసిక నిపుణుడు ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. స్టేషన్‌ పరిధిలోని విద్యాసంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించాలని..డ్రగ్స్‌ నిర్మూలనపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఎస్పీల స్థాయిలో గైడ్‌లైన్స్‌ రూపొందించాలని చెప్పారు. పోలీసులకు ప్రమోషన్లు కల్పించే సమయంలో మోరల్‌ పోలిసింగ్‌కు పాయింట్లు ఇవ్వాలని సూచించారు. సమాజానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు రోల్‌మోడల్‌గా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు డ్రగ్స్‌ను అరికట్టేందుకు హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో కలిసి వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాకమిషనర్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి