Telangana: ఈ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు..

సొంత జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‎లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పునరావాసం సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పూర్తికి 2025 డిసెంబర్ డెడ్ లైన్ విధించారు సీఎం రేవంత్. పాలమూరు పర్యటనలో.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై సుధీర్ఘంగా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్.

Telangana: ఈ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు..
Cm Revanth Reddy
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 11, 2024 | 3:17 PM

సొంత జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‎లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పునరావాసం సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పూర్తికి 2025 డిసెంబర్ డెడ్ లైన్ విధించారు సీఎం రేవంత్. పాలమూరు పర్యటనలో.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై సుధీర్ఘంగా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టుల పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారిగా నివేదిక సమర్పించాలన్నారు సీఎం. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ పెండింగ్ చెల్లింపులు మొదటి ప్రాధాన్యతాంశంగా.. ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులను రెండవ ప్రాధాన్యత కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పనులు పై మొదట దృష్టి సారించాలన్నారు సీఎం. నెట్టెంపాడు ప్రాజెక్టు మొత్తాన్ని మరోసారి రీ ఎగ్జామిన్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పూర్తికి ఎంత సమయం పడుతుంది? ఎంత మొత్తం నిధులు కావాలో స్పష్టంగా అధికారులు నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఆర్డీఎస్ కు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో చర్చించి, పరిష్కరించాల్సిన అంశాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఆర్డీఎస్‌పై కొత్త ప్రతిపాదనకు ఏమేమి కావాలో ఆలోచించి ప్రతిపాదించాలన్నారు.

ఇక తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలంటే ఏం కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా కానాయ్ పల్లి ఆర్ అండ్ ఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అవసరమైతే గ్రామ సభ నిర్వహించి ఇండ్లు, భూములు కోల్పోయిన వారికి పునరావాస కల్పించాలన్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఆర్ అండ్ ఆర్ సమస్య లేకుండా రిజర్వాయర్ సామర్ధ్యాన్ని పెంచడాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం డిజైన్ చేసిన ఆయకట్టును పూర్తిస్థాయిలో అందించేందుకు స్పష్టమైన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా.. డిసెంబర్ 2025 నాటికి కోయిల్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇచ్చారు.

పాలమూరు- రంగారెడ్డి తప్ప అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ప్రాజెక్టు వారిగా సూక్ష్మ స్థాయిలో స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌తో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు వివరాలతో పాటు.. కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలని సూచించారు. ప్రతి ప్రాజెక్ట్ పై 30 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుందన్నారు సీఎం రేవంత్. పాలమూరు సాగు ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు సీఎం రేవంత్. డెడ్ లైన్ పెట్టి మరీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్‌ ఛానల్ ద్వారా నిధులిస్తామనడంతో.. పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది.

శ్రీశైలంలో చిరుత స్వైర విహారం.. వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్