AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: రాష్ట్రాల హక్కులను హరించడమే.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..

ప్రధాని మోడీ(PM Modi)కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ఐఏఎస్‌(IAS)ల నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్..

CM KCR: రాష్ట్రాల హక్కులను హరించడమే.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..
Cm Kcr Writes A Letter To Prime Minister Modi
Sanjay Kasula
|

Updated on: Jan 24, 2022 | 6:39 PM

Share

ప్రధాని మోడీ(PM Modi)కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ఐఏఎస్‌(IAS)ల నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్(CM KCR writes a letter to Prime Minister Modi). కేంద్ర ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల హక్కులను హరిస్తాయన్నాయని అభిప్రాయ పడ్డారు. నిబంధనల సవరణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉన్నాయని ఆందోలన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రాల అనుమతి లేకుండా అధికారులు కేంద్ర సర్వీసులకు తీసుకోవడం ఏకపక్ష నిర్ణయమన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమన్నారు.

ఇది రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడ.. ఈ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో జోక్యం చేసు కోవడమే అని అన్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణ కంటే ముందే పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు సహా పలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయమై ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఆమె తన రెండవ లేఖలో, “సవరించబడిన సవరణ ప్రతిపాదన మునుపటి కంటే చాలా కఠినమైనదని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇది మన గొప్ప సమాఖ్య రాజకీయాల పునాదికి.. భారత రాజ్యాంగ ప్రణాళిక  ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని నేను భావిస్తున్నాను. అంటూ పేర్కొన్నారు.

ఒకే రాష్ట్రాలలో ఉంచలేం.. : కేంద్రం

అదే సమయంలో, ఈ నిబంధనలో మార్పుకు సంబంధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులను ఎల్లప్పుడూ రాష్ట్రాలలో ఉంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే ఇది వారి సర్వీస్, అధికారులు రెండింటికీ సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రాలలో పనిచేసి, కేంద్రానికి తిరిగి వచ్చిన తర్వాత అధికారుల వ్యక్తిగత అభివృద్ధికి ఒక ప్రత్యేక విధానం లభిస్తుందని పేర్కొంది కేంద్రం.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..