CM KCR: నిరుద్యోగులంతా రేపు టీవీ చూడండి.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
CM KCR: నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపు 10గంటలకు అంతా టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR – Telangana Jobs: 16 గంటలు.. ఇంకో 16 గంటలు. తెలంగాణ యావత్తు ఎదురు చూస్తోంది.. రేపు ఉదయం 10 గంటలకు.. అసెంబ్లీలో CM కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు.? నిరుద్యోగులకు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఉత్కంఠ నెలకొంది. నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపు 10 గంటలకు అంతా టీవీలు చూడాలంటూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. వనపర్తి బహిరంగ సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఈ సభలో నిరుద్యోగుల అంశంపై మాట్లాడిన సీఎం కేసీఆర్.. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ లో ప్రకటన చేస్తానని తెలిపారు. అయితే.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం. అయితే ఉద్యోగాల నియామకాలపై ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నిరుద్యోగులు అందరూ రేపు ప్రకటన చూడాలని కేసీఆర్ పేర్కొనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగాల ప్రకటన లేదా.. నిరుద్యోగ భృతి అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా రేపు స్పష్టత ఇవ్వనున్నారు.
70 వేలకు పైగా ఖాళీలు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలలో కలిపి 70 వేల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్, హెల్త్ డిపార్టుమెంటుల్లో అత్యధిక ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ శాఖలలో ఉద్యోగాలు ఉన్నాయి. లక్ష ఉద్యోగాలు టార్గెట్ అని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ఉద్యోగాల కోసం మూడు నుంచి నాలుగు వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమచారం. నెల రోజుల్లో నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు. కోర్టు చిక్కులు రాకుండా పకడ్బందీగా నియమకపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వనపర్తిపై వరాల జల్లు కురిపించారు. సీఎం సహాయనిధి నుంచి వనపర్తి పట్టణానికి రూ.కోటీ, మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నామని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందందటూ తెలిపారు. కరెంట్ కోతలు, తాగు, సాగు నీరు సమస్యలను అధిగమించామని.. ఇది ప్రజలందరి శ్రమ ఫలితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని CM కేసీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు CM కేసీఆర్. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు చెప్పారు. వనపర్తిలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన CM కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడిని కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా చిట్యాల చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ మార్కెట్ యార్డ్‌ని ప్రారంభించారు.
Also Read: