AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Independence Day: రాష్ట్రంలో ఆ స్కీమ్‌ దేశానికే ఆదర్శంగా మారింది: సీఎం కేసీఆర్‌

ఎంతో కష్టపడి, మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఇప్పుడు స్వేచ్ఛగా బతికే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంతో కష్టపడి, ఎందరి పోరాటాల కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు, దుర్భరమైన బతుకులు ఇలా చెప్పుకొంటూ పోతో ఎన్నో కష్టాలు ఉండేవని, దీంతో ..

TS Independence Day: రాష్ట్రంలో ఆ స్కీమ్‌ దేశానికే ఆదర్శంగా మారింది: సీఎం కేసీఆర్‌
Ts Cm Kcr
Subhash Goud
|

Updated on: Aug 15, 2023 | 11:25 AM

Share

దేశంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరించగా, ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కోండ కోటలో జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంతో కష్టపడి, మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఇప్పుడు స్వేచ్ఛగా బతికే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంతో కష్టపడి, ఎందరి పోరాటాల కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు, దుర్భరమైన బతుకులు ఇలా చెప్పుకొంటూ పోతో ఎన్నో కష్టాలు ఉండేవని, దీంతో రాష్ట్ర ప్రజల బతుకులు బాగు కోసం తెలంగాణ సాధించుకున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం నడిచిందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయింది:

అహింసా మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని అన్నారు. గత ప్రభుత్వాల తీరుతో రైతన్నల జీవితాలు బలైపోయాయని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుంటే కొందరు అల్పబుద్దితో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. ఎందరో ఎన్ని మాటలు మాట్లాడినా.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగినట్లు తెలిపారు.

రైతులకు రుణ మాఫీ:

రాష్ట్రంలో సంపదను పెంచామని, రైతులకు రెండు సార్లు పంట రుణాలు మాఫీ చేశామని అన్నారు. రైతులకు ఈ తరహా రుణ మాఫీ చేసింది తమ ప్రభుత్వమేనని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ఏలుబడిలో సుసంపన్నంగా సాగుబడి జరిగిందన్నారు. దశాబ్దాలుగా ఉన్న ఆదివాసీయుల సమస్యలు తీర్చామని, వారి పోడుభూముల సమస్యలను తీర్చి వారికి రైతు బంధు పథకం అందించినట్లు తెలిపారు. అలాగే పోడుభూముల వ్యవహారంలో వారిపై ఉన్న కేసులను ఎత్తివేసినట్లు చెప్పారు. వరి దిగుబడిలో పంజాబ్‌తో పోటీ పడుతున్నామని, కొంత మంది లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. విపక్షాలు రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో నీగునీటి ఇబ్బందులు తీర్చామని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి నీటి సమస్యను తీర్చినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో నగదు బంధు పథకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడు లేని విధంగా దళితులకు 10 లక్షల రూపాయల నగదును అందించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.3 లక్షలు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని, లక్షల మంది గిరిజనులకు పోడుభూములు అందించినట్లు చెప్పారు. అలాగే పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఉచితంగా అందజేస్తున్నామని, సొంత స్థలాలు కలిగి ఇంటిని నిర్మించుకుంటే వారికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని, ఆ డబ్బులు మూడు విడతలుగా లక్ష చొప్పున అందిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి