AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Independence Day: మా పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకువచ్చాం: సీఎం జగన్‌

దేశ వ్యాప్తంగా పంద్రాగస్ట్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు జెండా ఆవిష్కరిస్తున్నారు. ఇక ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాల ఫలితంగా..

AP Independence Day: మా పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకువచ్చాం: సీఎం జగన్‌
Ap Cm Jagan
Subhash Goud
|

Updated on: Aug 15, 2023 | 12:26 PM

Share

దేశ వ్యాప్తంగా పంద్రాగస్ట్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు జెండా ఆవిష్కరిస్తున్నారు. ఇక ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ , సేవా రంగంలో సుదీర్ఘమైన ప్రగతి ఉందన్నారు. అలాగే గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు తీసుకువచ్చామన్నారు. పౌర సేవలను ఇంటింటికి తీసుకువెళ్లగలిగామని వెల్లడించారు.

గ్రామ, వార్డు సూచివాలయ వ్యవస్థను తెచ్చామని, ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పు తీసుకువచ్చినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని, రాష్ట్రంలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందించామని వివరించారు.

గతంలో ఏ ప్రభుత్వం అమలే చేయని పథకాలను తమ ప్రభుత్వంలో అమలు చేశామని, సంక్షేమ పథకాలన్ని అక్క చెల్లెమ్మల పేరు మీదు ఇస్తున్నామని అన్నారు.