CM KCR Review: కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. వైరస్ నియంత్రణపై అధికారులకు కీలక సూచనలు
రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
CM KCR Coronavirus Review: రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్ పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే, ధాన్యం కొనుగోలుకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, తెలంగాణలో ఈనెల 20 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఇక, పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 20న మరోసారి కేబినెట్ భేటీ కానుంది. లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.
Read Also…
పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..