Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుంచి 1999 రూపాయలకే సిటీ స్కానింగ్.. వ్యాక్సిన్ ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే ఆస్పత్రుల సీజ్..

CT Scanning For Rs 1999 : కరోనా సోకిన పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే బిల్లు ఎంతవుతుందోనని భయపడుతున్నారు.

రేపటి నుంచి 1999  రూపాయలకే సిటీ స్కానింగ్.. వ్యాక్సిన్ ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే ఆస్పత్రుల సీజ్..
Srinivas Gowd
Follow us
uppula Raju

|

Updated on: May 17, 2021 | 6:12 PM

CT Scanning For Rs 1999 : కరోనా సోకిన పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే బిల్లు ఎంతవుతుందోనని భయపడుతున్నారు. టెస్ట్‌లు చేసుకోలేక, టీకాలకు డబ్బులు చెల్లించలేక దీన స్థితిలో తనువుచాలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావొద్దని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి మహబూబ్ నగర్‌ జిల్లాలో కేవలం 1999 రూపాయలకే సిటీ స్కానింగ్ తీయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు అన్ని ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా కేవలం 1999 రూపాయలకు సిటి స్కాన్ చేసేందుకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాల అసోసియేషన్ అంగీకరించిందని తెలిపారు. కరోనా తీవ్ర ఉధృతిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో పెడుతున్నామని పేర్కొన్నారు. ధరల నియంత్రణ విషయమై డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్డివో, డీఎస్పీలతో టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రులలో 20 శాతం బెడ్లు తప్పనిసరిగా పేదలకు కేటాయించాలని, అలా చేయలేని పక్షంలో ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు 450 రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని ఇంజెక్షన్లు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు అవసరమైన వారికి మాత్రమే ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 13 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయని , ఎవరైనా ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మినట్లయితే ఆస్పత్రులను సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. జిల్లాలో చాలా ప్రైవేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో సామాన్యులకు, పేదలకు తక్కువ ధరలకు వైద్య సేవలు అందిస్తున్నారని, తక్కినవారు కూడా అలాగే అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

అవసరం ఉంటే తప్ప సిటీ స్కానింగ్‌కు రాకూడదని, పల్మనాలజిస్ట్ సూచన మేరకే సిటి స్కాన్ తీయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు సిటి స్కాన్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు .ఈ నిర్ణయాన్ని కాదని ఎవరైనా ఎక్కువ ధరకు సీటీస్కాన్ చేసినట్లయితే సదరు డయాగ్నస్టిక్ సెంటర్ లను మూసివేస్తామని మంత్రి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ స్థాయిలో సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలను కూడా జిల్లాలో వేగవంతం చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద 23 మంది లబ్ధిదారులకు 10 లక్షల 4 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

Tv9

Tv9

Priyanka Nick Jonas: షూటింగ్‏లో గాయపడ్డ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్.. ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది..

భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం

CM KCR Review: కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. వైరస్ నియంత్రణపై అధికారులకు కీలక సూచనలు