CM KCR: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రి అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

CM KCR meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో శనివారం సమావేశమయ్యారు. మూడు రోజులుగా..

CM KCR: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రి అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి
Cm Kcr Meets Amit Shah
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2021 | 7:02 PM

CM KCR meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో శనివారం సమావేశమయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ నిన్న ప్రధాని మోదీని కలిసి పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌ అమిత్‌షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి.. పలు విజ్ఞప్తులు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎస్‌ల కేటాయింపుతో పాటు మరికొన్ని అంశాలను కేసీఆర్‌ ప్రస్తావించారు.

రాష్ట్రంలో నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్‌పై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని, ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగినట్లు వివరించారు. కొత్త 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు.

2016లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటవడంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కేసీఆర్‌ అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రం అందించారు.

Also Read:

ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై విద్యార్థి అఘాయిత్యం.. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

Crime: సోషల్‌ మీడియాలో యువకుడి వెకిలిచేష్టలు.. మహిళగా నటిస్తూ.. అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే..?

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్