Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్ గూటికి సీఎం కేసీఆర్ సన్నిహితుడు.. బీఆర్‌ఎస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారంటూ..

Telangana: కారు చోడో.. హత్‌ జోడో.. సాత్‌ ఛలో అంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరిరావు. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన శ్రీహరిరావు.. ఇవాళ కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు కూచాడి శ్రీహరిరావు.

Telangana: కాంగ్రెస్ గూటికి సీఎం కేసీఆర్ సన్నిహితుడు.. బీఆర్‌ఎస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారంటూ..
CM KCR
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2023 | 8:30 AM

Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరిరావు.. ఇవాళ కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఉద్యమకారుల నమ్మకాలు బీఆర్‌ఎస్‌ వమ్ముచేసిందని మండిపడుతున్నారు. కూచాడి శ్రీహరిరావు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించి.. వారి సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనను, తన అనుచరులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తనకు, తన అనుచరులకు ఆహ్వానం పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కారు చోడో.. హత్‌ జోడో.. సాత్‌ ఛలో నినాదంతో నిర్మల్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోస్తామంటున్నారు కూచాడి శ్రీహరిరావు.

Kuchadi Srihari Rao

Kuchadi Srihari Rao

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో శ్రీహరి రావు క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కారు పార్టీలో చురుకుగా పనిచేశారు. దీంతో ఆయనకు బిఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పగా వాటిని సైతం ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. అయితే గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో తమకు సరైన స్థానం దక్కడం లేదని అధిష్టానంపై కోపంగా ఉన్న ఆయన ఈనెల 4న నిర్మల్ లో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు సైతం గైర్హజరయ్యారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేయడం పట్ల నియోజకవర్గంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..