Pakistan Drones: భారత్‌లో పాక్ డ్రోన్ కూల్చివేత.. వాటిని తరలిస్తుండగా గుర్తించిన బీఎస్‌ఎఫ్ బలగాలు..
Amritsar: భారత్‌పై పాకిస్తాన్ డ్రోన్ కుట్రలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ఎగురుతూ వస్తోన్న డ్రోన్‌లు సరిహద్దుల్లో అలజడి రేపుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలను సరఫరా చేసేందుకు డ్రోన్లను..
Amritsar: భారత్‌పై పాకిస్తాన్ డ్రోన్ కుట్రలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ఎగురుతూ వస్తోన్న డ్రోన్‌లు సరిహద్దుల్లో అలజడి రేపుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలను, మత్తు పదార్థాలను సరఫరా చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి ఉగ్రమూకలు. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్ శివార్ల లోని షాద్‌పూర్ కలాన్ ప్రాంతంలో పాక్ డ్రోన్ ను గుర్తించారు బీఎస్‌ఎఫ్ జవాన్లు. అమృత్‌సర్ శివార్లలో కూలిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోన్ నార్కోటిక్స్‌ని సరఫరా చేసేందుకు వాడినదిగా అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా పంజాబ్ సరిహద్దులో పదే పదే ఏదో ఒక చోట పాకిస్తాన్ డ్రోన్లు లభ్యమవుతున్నాయి. డ్రోన్లను డ్రగ్స్ సరఫరాతో పాటు ఆయుధాల స్మగ్లింగ్‌కు వినియోగిస్తోంది పాక్ ఉగ్రమూక ఐఎస్‌ఐ. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోన్న డ్రోన్లను పలుసార్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూల్చివేసింది. పాలిథిన్ కవర్లలో దాదాపు ఐదారు కిలోల బరువున్న మాదక ద్రవ్యాలను సైతం డ్రోన్లలో సరఫరా చేస్తున్నట్టు గతంలో గుర్తించారు. తాజాగా మరోసారి పాకిస్తాన్ ఐఎస్‌ఐ డ్రోన్‌లను భారత భూభాగంలోకి పంపడంతో ఉగ్రమూకల పనిపట్టేందుకు సిద్దమయ్యారు బీఎస్‌ఎఫ్ జవాన్లు.
Based on specific intelligence inputs, 01 Pakistani #drone, in broken condition has been recovered by alert troops of #BSF in Amritsar.
Details follow… pic.twitter.com/g4ZInLKUiP
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) June 12, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..