Telangana: సర్కారు బడుల్లో పెరుగుతోన్న పిల్లలు.. విద్యార్థులతో కళకళలాడుతున్న తెలంగాణ గ్రామీణ ప్రాంత పాఠశాలు

చెరువులు, కుంతలు, వాగులు, వంకలతో ఇప్పటికే సస్యశ్యామలంగా తొణికిసలాడుతోన్న తెలంగాణలో

Telangana: సర్కారు బడుల్లో పెరుగుతోన్న పిల్లలు.. విద్యార్థులతో కళకళలాడుతున్న తెలంగాణ గ్రామీణ ప్రాంత పాఠశాలు
Navodaya Schools Exam
Follow us

|

Updated on: Sep 04, 2021 | 2:09 PM

Telangana Government Schools: చెరువులు, కుంతలు, వాగులు, వంకలతో ఇప్పటికే సస్యశ్యామలంగా తొణికిసలాడుతోన్న తెలంగాణలో ఎడ్యుకేషన్ కూడా ఒక పండుగలా సాగుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసుకుపోయిన సర్కారు బడుల్లో స్కూల్స్ రీ ఓపెన్ తర్వాత పిల్లల సంఖ్య బాగా పెరుగుతుండటం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,285 ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ప్రత్యక్ష బోధన మొదలైపోయింది. పాఠశాలలు తెరిచి నేటికి మూడో రోజు 42.76 శాతం మంది విద్యార్థులు హాజరు కనిపించడంతో పాఠశాలలు ఆహ్లాదకరంగా మారిపోయాయి. ఇంతకాలం పాడుబడ్డట్టు కనిపించిన స్కూల్స్.. చిన్నారుల రాకతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

కాగా, రాష్ట్రంలో ఇంకా తెరుచుకోని 1,245 పాఠశాలలు ఉన్నట్టు లెక్కతేలింది. వీటిలో 63 ఎయిడెడ్‌, 1,182 ప్రయివేటు పాఠశాలలు ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెరుతోండటం విశేషం. తొలిరోజు ప్రభుత్వ బడుల్లో 27.45 శాతం మంది హాజరయ్యారు. రెండోరోజు గురువారం 38.82 శాతం మంది.. మూడోరోజు 42.76 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

తొలిరోజు కంటే మూడో రోజు విద్యార్థులు 15.31 శాతం మంది పెరిగారు. 669 ఎయిడెడ్‌ పాఠశాలకు 606 స్కూళ్లలో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. హైదరాబాద్‌లో 1,886 ప్రయివేటు పాఠశాలల్లో తెరుచుకున్నవి 1,221 స్కూళ్ళు. ప్రత్యక్ష బోధన ప్రారంభం కాని 665 స్కూళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు అన్న తేడా లేకుండా పాఠశాలలు తెరుచుకోవడం మరింత సంతోషకర విషయం.

Read also:  Honey Trap: నగ్నంగా వీడియోకాల్‌..! అమాయకుల్ని నిండాముంచుతోన్న మాయలేడి..