CM Revanth: తెలంగాణ సీఎం సీటు పదేళ్లపాటు కొడంగల్‌దే! సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
పదేళ్లు మనమే... తెలంగాణ సీఎం సీటు పదేళ్లపాటు కొడంగల్‌దే.. ముఖ్యమంత్రి పదవి టెన్ ఇయర్స్ కొడంగల్‌ను దాటి పోదు.. ఇవీ.. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్.. ఎస్... పదేళ్లు తానే ముఖ్యమంత్రిని అంటూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు.. బీజేపీ, బీఆర్ఎస్‌పైనా విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తగ్గేదేలే అంటూ ముఖ్యమంత్రి పదవిపై మళ్లీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. సొంత ఇలాకాలో పర్యటించిన ఆయన.. కంచె వేసి మరీ కొడంగల్‌ను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కొడంగల్ బిడ్డలు హైదరాబాద్ వచ్చి చూస్తూ మనమంటే ఏంటో తెలుస్తుందంటూ స్థానికుల్లో జోష్ నింపారు సీఎం రేవంత్‌రెడ్డి. కొడంగల్‌లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అంబేద్కర్‌ను బీజేపీ అన్ని రకాలుగా అవమానిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు.
ఇక.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కి అధికారం పోయిందని బీఆర్ఎస్ బాధపడుతోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన కొన్ని పనులకు ఇప్పుడు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం పదేళ్లపాటు కొడంగల్‌ను దాటి పోదన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదేసమయంలో.. కొడంగల్‌ను దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని.. రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.