Karimnagar: నోరూరించే ఆఫర్.. రూపాయికే వేడి..వేడి బిర్యానీ.. కానీ చిన్న ట్విస్ట్
Telangana News: ఎండను కూడా లెక్కచేయకుండా.. బిర్యానీ కోసం.. జనాలు.. ఎగబడడంతో రెస్టారెంట్ యాజమాన్యం షట్టర్ క్లోజ్ చేసింది. ఫలితంగా.. బిర్యానీ ప్రియులు.. ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
నార్మల్‌గా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లు.. ఎవరికి ఇష్టమొచ్చిన ఆఫర్లు వాళ్లు ఇస్తుంటారు. ఆఫర్లు ఇవ్వడమనేది.. వారివారి బిజినెస్ ట్రిక్స్‌లో భాగం. ఆఫర్లు ఇచ్చే దగ్గరకు.. కస్టమర్లు కూడా పరుగులు పెడుతుంటారు. అయితే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అని థింక్ చేస్తున్నారు కదూ.. ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదులే.. ఇప్పుడు అసలు పాయింట్‌కు వచ్చేద్దాం.. తెలంగాణలోని కరీంనగర్‌లో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా.. దాని ఓనర్ బిర్యానీకి సంబంధించి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూపాయి నోటుకు బిర్యానీ అని ప్రచారం చేశారు. నోటుకు బిర్యానీ ఫ్రీ అని ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించారు. ఇప్పుడు.. అంతగా రూపాయి నోటు ఎవరి దగ్గర ఉందిలే అనుకున్న రెస్టారెంట్ ఓనర్‌కు కస్టమర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
కరీంనగర్‌లో రూపాయ్ నోటుకు బిర్యానీ ఆఫర్‌ను చూసిన కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకేముంది.. ఎక్కడెక్కడో దాచుకున్న రూపాయి నోటుకు దుమ్ముదులిపారు కరీంనగర్ పట్టణ ప్రజలు. రూపాయ్ నోటును చేతబట్టుకుని కొత్త రెస్టారెంట్ దగ్గర వాలిపోయారు. మధ్యాహ్న సమయానికంటే ముందే బిర్యానీ ప్రియులు రూపాయ్ నోటుతో ఆ రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. చవకగా బిర్యానీ వస్తుండడంతో… ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు తీరారు.
ఎండను కూడా లెక్కచేయకుండా జనం ఎగబడడంతో రెస్టారెంట్ యాజమాన్యం షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో.. బిర్యానీ ప్రియులు.. కొద్దిసేపు ఎండలో పడిగాపులు కాశారు. మధ్యలో కాస్త తోపులాట కూడా జరిగింది. దీంతో డోర్స్ క్లోజ్ చేసిన రెస్టారెంట్ సిబ్బంది.. రూపాయి నోటు తెచ్చునవారికి.. కౌంటర్ ఏర్పాటు చేసి పార్శిల్ రూపంలో బిర్యానీ అందజేశారు. మొత్తంగా.. రూపాయ్ నోటుకు బిర్యానీ దక్కించుకున్న వారు నోరూరించుకుంటూ ఇంటికి వెళ్తే.. ఓనర్ మాత్రం.. జనం తాకిడికి షాక్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.