AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏం చెప్పారంటే

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ” కాంపెన్ సేటరి అఫారెస్టేషన్ ఫండ్” క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడం లేదని లేఖ రాశారు.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏం చెప్పారంటే
Kishan Reddy
Aravind B
|

Updated on: Apr 18, 2023 | 7:25 AM

Share

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ” కాంపెన్ సేటరి అఫారెస్టేషన్ ఫండ్” క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడం లేదని లేఖ రాశారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధుల గురించి ఆ లేఖలో తెలియజేశారు. మానవ అవసరాల కోసం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తుందని..దీంతో ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమేకాకుండా, ప్రాకృతిక విపత్తులు సంభవించటానికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.అందులో భాగంగానే “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” ను ఏర్పాటు చేసిందన్నారు.

అడవుల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలిపి, CAMPA ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. అందులో భాగంగా తెలంగాణకి రూ.3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేసిందని తెలిపారు. అయితే గత 3 ఏళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే, ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. వినియోగానికి ఆమోదం పొందిన నిధుల విలువకు, వినియోగించుకున్న నిధుల విలువకు దాదాపు 610 కోట్ల వ్యత్యాసం ఉందని ఆరోపించారు. అయితే మరోవైపు అడవుల సంరక్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..