Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు.. 6వతేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, సీఏం కేసీఆర్ కుమార్తె కవితకు సిబిఐ అధికారులు 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. ఈనెల 6వతేదీ  ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు.. 6వతేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 02, 2022 | 10:47 PM

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, సీఏం కేసీఆర్ కుమార్తె కవితకు సిబిఐ అధికారులు 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. ఈనెల 6వతేదీ  ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ లేదా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయాల్లో వెసులుబాటును బట్టి ఏదో ఒకచోట హాజరుకావాలన్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఇచ్చిన రాత పూర్వక పిర్యాదు ఆధారంగా  నమోదు చేసిన కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను విచారణకు పిలిచినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు.. మరో 14 మందిపై నమోదు చేసినట్లు నోటీసులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విచారణకు హాజరుకావాలన్నారు. సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సాహి పేరుమీద ఈ నోటీసులను జారీచేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె వివరణ తీసుకునేందుకు నోటీసులు జారీచేసి పిలిచినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ మద్యంపాలసీ అవకతవకలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఇటీవల అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పలు అంశాలను  అంశాలను పొందుపర్చింది. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని రిపోర్టులో పేర్కొంది. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగామని… అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిన మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవని తెలిపింది. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేదని రిపోర్టులో ఈడీ పేర్కొంది.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై స్పందించిన కవిత.. ఇదంతా బీజేపీ కుట్రగా ఆరోపించారు. ప్రధానంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించిన విషయం తెలిసిందే.  కాగా.. ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని తన ఇంటివద్దే సీబీఐ అధికారులకు తన వివరణ ఇస్తానని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??