Telangana: దేశ రక్షణకు వెళ్లి ఊపిరి వదిలిన తెలంగాణ బిడ్డ.. అనుమానాస్పద స్థితిలో మృతి..!

దేశ రక్షణ కోసం గుజరాత్ వెళ్లిన తెలంగాణ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బల్ల గంగా భవాని నాలుగు సంవత్సరాల క్రితం బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా చేరింది.

Telangana: దేశ రక్షణకు వెళ్లి ఊపిరి వదిలిన తెలంగాణ బిడ్డ.. అనుమానాస్పద స్థితిలో మృతి..!
Bsf Jawan Ganga Bhavani
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 08, 2024 | 2:30 PM

దేశ రక్షణ కోసం గుజరాత్ వెళ్లిన తెలంగాణ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బల్ల గంగా భవాని నాలుగు సంవత్సరాల క్రితం బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా చేరింది. డ్యూటీలో చేరినప్పటి నుండి చురుక్కు ఉండే గంగా భవాని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించింది. కలివిడిగా ఉండే గంగా భవాని మృతితో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.

నార్త్ బెంగాల్లో విధులు నిర్వహించిన గంగాభవాని ఎనిమిది నెలల క్రితం గుజరాత్‌కు బదిలీపై వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్ గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన గంగా భవాని సెప్టెంబర్ 1వ తేదీన విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్ళింది. గుజరాత్ బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో విశ్రాంతి కోసం శనివారం(సెప్టెంబర్ 7) రాత్రి గాంధీనగర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌కు వచ్చిన గంగాభవాని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

అయితే గంగాభవాని మృతి చెందిన విషయాన్ని ఆదివారం ఉదయం తెలుసుకున్న అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గంగా భవానీ మృతికి గల కారణాలు తెలియ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కుటుంబసభ్యులు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే గంగాభవాని మృతికి గల కారణాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గంగా భవాని మృతదేహాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు మృతదేహం గోదావరిఖనిలోని తన సొంత ఇంటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశానికి సేవ చేయాలని రాష్ట్రాన్ని వీడి వెళ్లిన గంగాభవాని, కానరాని లోకాలకు తరలి వెళ్లడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఈ ఉదంతం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు