Telangana: మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

కులగణన సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని హరీష్‌రావు విమర్శించారు.

Telangana: మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన - కేటీఆర్
Politics
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2024 | 7:08 PM

బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది కిందట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని.. కానీ ఇప్పటివరకు అందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు.

ఏం సాధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వారోత్సవాలు జరపాలనుకుంటోందని ప్రశ్నించారు కేటీఆర్. తాము కూడా కాంగ్రెస్ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్‌రావు. రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే అని.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయని విమర్శించారు. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..