Telangana: ఇదెక్కడి మోసం రా మావా..! యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసినందుకు..

యూట్యూబ్ ఛానెల్స్‌లను సబ్‌స్క్రైబ్‌ చేసి, తమకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే డబ్బులు ఇస్తామని ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వాట్సాప్‌లో పార్ట్ టైం జాబ్ ఉందని సైబర్ నేరగాళ్లు మెసేజ్ చేశారు. రూ.8.99 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఎలా జరిగిందంటే?

Telangana: ఇదెక్కడి మోసం రా మావా..! యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసినందుకు..
Cybercriminals Stole Eight Lakh Rupees From A Women
Follow us
Ranjith Muppidi

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 10, 2024 | 9:43 PM

పార్ట్ టైం జాబ్ పేరిట 23 ఏళ్ల యువతిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బాధిత యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. సదరు యువతికి వాట్సాప్‌లో పార్ట్ టైం జాబ్ ఉందని సైబర్ నేరగాళ్లు మెసేజ్ చేశారు.

యూట్యూబ్ ఛానెల్స్‌లను సబ్‌స్క్రైబ్‌ చేసి, తమకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే డబ్బులు చెల్లిస్తామన్నారు. కొద్దీ రోజులు డబ్బులు చెల్లించడంతో బాధితురాలికి నమ్మకం కలిగింది. ఇంకా పెద్ద మొత్తంలో లాభాలు కావాలంటే.. ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఓ లింక్‌ను పంపించారు. అది నిజమని నమ్మిన యువతి తన వద్ద ఉన్న డబ్బులను పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ డబ్బులకు లాభాలు వచ్చినట్లు నేరగాళ్లు వెబ్ సైట్లో చూపించారు.

కొద్ది రోజులకు డబ్బులను విత్ డ్రా చేయడానికి బాధితురాలు యత్నించగా.. డబ్బులు రాలేవు. దీంతో యువతి స్కామర్లను సంప్రదించగా వారు మరికొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఇదంతా స్కామ్‌గా గ్రహించిన బాధితురాలు మొత్తం రూ.8 లక్షల 99 వేలు మోసపోయినట్లు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..