Watch: పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన ప్రేమికులు.. పెళ్లి ముందురోజు వరుడు జంప్.!
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. షరామామూలే.. పెద్దలు ఒప్పుకోలేదు. ఇద్దరూ మేజర్లే కావడంతో పారిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా అలా చేయలేదు. పెద్దల అంగీకారంతోనే చేసుకోవాలనుకున్నారు. నానా కష్టాలు పడి పెద్దవాళ్లను పెళ్లికి ఒప్పించారు. పెళ్లి ముహూర్తం పెట్టించారు. ముహూర్తం దగ్గరకొచ్చింది. తెల్లవారితే పెళ్లి.. ఇక అంతా సుఖాంతమే అనుకున్న సమయంలో పెళ్లికొడుకు... పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
పెళ్లికి ముందురోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు పెళ్లికొడుకు.. పోతూ పోతూ కాబోయే మామగారు ఇచ్చిన రూ.10 లక్షలు తీసుకుని మరీ జంప్ అయ్యాడు. ప్రియుడు ఇచ్చిన ఈ షాక్ కు పాపం ఆ ప్రియురాలు షాకయింది. హైదరాబాద్ లోని మారేడ్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారేడ్ పల్లికి చెందిన సందీప్ రమేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వీరి ప్రేమ కథకు తల్లిద్రండులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరూ కష్టపడి పెద్దవాళ్లను ప్పించారు. ఈ నెల 8న వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ప్రేమ వివాహమే అయినా కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో ఇరుకుటుంబాలు తలమునకలై ఉండగా… గురువారం నాడు సందీప్ రమేశ్ అందరికీ షాకిచ్చాడు. డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పెళ్లికూతురు నివ్వెరపోయింది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లికూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.