Telangana: దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్ చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మీ బతుకులు బాగుండాలంటే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్ చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మీ బతుకులు బాగుండాలంటే కేసీఆర్ చావాలంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కుమారులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్నారని విమర్శించారు. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.
పుట్టబోయే బిడ్డమీద కూడా లక్షా 50 వేల అప్పు వేశారు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా.? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు భస్మాసుర సమితి. సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి.. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలి. పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి విక్రమార్కతో ఆయన చర్చించారు. అనంతరం 26 మంది సినీయర్ నేతలతో ఠాక్రే వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం