AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌.. ఆరోగ్యం సహకరిస్తే..

తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నానన్న వార్తలను బీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత డి శ్రీనివాస్‌ ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు.

D Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌.. ఆరోగ్యం సహకరిస్తే..
D Srinivas
Basha Shek
|

Updated on: Mar 26, 2023 | 9:57 AM

Share

తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నానన్న వార్తలను బీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత డి శ్రీనివాస్‌ ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు. ‘ప్రజాక్షేత్రంలో పని చేసే వారికి ప్రజలే ముఖ్యం. నా పెద్ద కుమారుడు డి. సంజయ్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్న సందర్భంగా తనకు నా శుభాకాంక్షలు. ఇప్పటికే బీజేపీలో చేరి నిజామాబాద్‌ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజానాయకుడిగా అందరి అభిమానులు అందుకుంటున్న నా చిన్న కుమారుడు డి. అరవింద్‌కు నా అభినందనలు. పార్టీలు వేరైనా, వాళ్లిద్దరూ కూడా తెలంగాణ ప్రజల అభ్యున్నతది కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారన్న విశ్వాసం నాకుంది. వారికి నా ఆశీస్సులు, అభినందనలు’

నా ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ను ఆశీర్వదిస్తా. అంతేకానీ నేను కాంగ్రెస్‌లోకి చేరుతానన్న వార్తలు అవాస్తవం’ అని లేఖలో పేర్కొన్నారు డీఎస్‌. కాగా ఈ రోజు ఉదయం గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టే దీక్షలో డీఎస్‌ పాల్గొంటారని ప్రచారం జరిగింది. వీటిపైనే స్పష్టతనిస్తూ లేఖను విడుదల చేశారు డి శ్రీనివాస్‌.

ఇవి కూడా చదవండి
D Srinivas Letter

D Srinivas Letter

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..