జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్.. మాగంటి సునీత పేరు ఖరారు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటుకు.. మాగంటి సునీత పేరును ఖరారు చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంపిక చేశారు బీఆర్ఎస్ అధినేత.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన… pic.twitter.com/nYGznPYvrk
— BRS Party (@BRSparty) September 26, 2025
