MLC Kavitha: మళ్లీ యాక్టీవ్‌ అవుతున్నారా?.. ఆసక్తికరంగా ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌ రీ ఎంట్రీ

పొలిటికల్‌గా ఆమె రీ ఎంట్రీ.. సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్రీ.. ఇప్పుడిదే అంశం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఆమె ఎత్తుగడలేంటి? ముఖ్యమంత్రి ముచ్చట వెనక మతలబేంటి?.. ఓ లుక్కెయ్యండి..

MLC Kavitha: మళ్లీ యాక్టీవ్‌ అవుతున్నారా?.. ఆసక్తికరంగా ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌ రీ ఎంట్రీ
Mlc Kavitha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 25, 2024 | 9:44 PM

తెలంగాణ రాజకీయాలపై మరోసారి తనదైన ముద్ర వేసేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. వ్యూహరచన చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయ్యి దాదాపు ఆర్నెళ్ల పాటు తీహార్‌ జైల్లో ఉన్న కవిత… మూణ్నెళ్ల క్రితం బెయిల్‌పై రిలీజయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లూ ఇంట్లోనే రెస్టు తీసుకున్న కవిత… ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

నిజామబాద్‌ ఎంపీగా ఒక రేంజ్‌లో రాజకీయం నడిపిన కవిత.. మళ్లీ ఆ జోష్‌ను అందుకునేందుకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కవిత.. ఇటీవల వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యా్ర్థులను పరామర్శించారు. వారికి జాగృతి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాజాగా, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారు. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ను కలిసిన కవిత.. బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చారు.

అంశాలవారీగా ముందుకు వస్తున్న కవిత.. మరోసారి పొలిటికల్‌గా యాక్టివ్‌ కాబోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది. జాగృతిపరంగానే కాదు, బీఆర్‌ఎస్‌లోనూ ఆమె కీలకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే దీక్షాదివస్‌ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఎంట్రీ ఎలా ఉంటుందనే విషయం పక్కనపెడితే.. కవితపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. పొలిటికల్‌గా ఆసక్తి రేపుతున్నాయి.

మొత్తానికి, పొలిటికల్‌గా కవిత రీ ఎంట్రీ… తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజాగా, సీఎం చేసిన కామెంట్స్‌తో.. అది మరో లెవల్‌కు వెళ్లిపోయింది. దీని నెక్స్ట్ ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..