Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Project Tour: మరోసారి పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచే షురూ..!

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర హాట్‌ టాపిక్‌గా మారింది.

BRS Project Tour: మరోసారి పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచే షురూ..!
Brs Mla, Mlc
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 25, 2024 | 8:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర హాట్‌ టాపిక్‌గా మారింది.

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండిస్తూ బీఆర్ఎస్ మరోసారి పోరుబాటకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో అక్కడినుంచే భారీ ర్యాలీగా కాళేశ్వరానికి బయలుదేరనున్నారు. ముందుగా లోయర్‌ మానేరు డ్యామ్‌ను సందర్శిస్తారు. అయితే.. ఈ ప్రాజెక్ట్‌ టూర్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందులో భాగంగా కాళేశ్వరానికి సకాలంలో రిపేర్లు చేయకపోవడం, నీటిని నిల్వ చేయడంలో వైఫల్యం చెందడంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది.

కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పును భూతద్దంలో చూపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్షన్‌. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజ్ నిలిచిందని చెబుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తుందని ఇటీవల కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి.. కానీ.. కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది.. జల హారతి పడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇప్పటికే గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రాజెక్టులన్ని ఖాళీగా ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపు హౌస్‌ల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళ్తున్నామని గులాబీ నేతలు చెబుతున్నారు.

మేడిగడ్డ ప్రాజెక్టును ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించి… పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనూ బృందం పర్యటనకు వెళ్లనుండడంతో రాజకీయంగా ఆసక్తి వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంత్రం LMD రిజర్వాయర్‌ దగ్గరకు చేరుకుంటారు బీఆర్‌ఎస్‌ నేతలు. ప్రాజెక్ట్‌ పరిశీలించి… రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ బృందం బస చేయనున్నారు. రేపు 10గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…