AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లెమ్మ పెళ్లిలో అన్నయ్య షాకింగ్ గిఫ్ట్.. అతిథులను సైతం కన్నీళ్లు పెట్టించిన వినూత్న కానుక..!

పెళ్లి వేడుకలో వధువు తరపు బంధువులు అ వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్..! కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ అన్నయ్య తన చెల్లి పెళ్లికి ఊహించని వినూత్న కానుక ఇచ్చి అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ఆ అన్నయ్య కానుక చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

చెల్లెమ్మ పెళ్లిలో అన్నయ్య షాకింగ్ గిఫ్ట్.. అతిథులను సైతం కన్నీళ్లు పెట్టించిన వినూత్న కానుక..!
Brother Wedding Gift
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 12:57 PM

Share

పెళ్లి వేడుకలో వధువు తరపు బంధువులు అ వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్..! కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ అన్నయ్య తన చెల్లి పెళ్లికి ఊహించని వినూత్న కానుక ఇచ్చి అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ఆ అన్నయ్య కానుక చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఏం చేశాడు..? ఆ అపురూప కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

పెళ్లి వేడుకలో వధువుతో సహా అక్కడున్న వాళ్లంతా బోరున విలపించిన వినూత్న ఘటన ఇది. ఏడాది క్రితం తండ్రి చనిపోయి దుఃఖంతో తల్లడిల్లుతున్న ఆ వధువుకు అన్నయ్య అదిరిపోయే కానుక ఇచ్చాడు. ఆరడుగుల ఎత్తుతో తండ్రి విగ్రహాన్ని తయారు చేయించిన అన్నయ్య ఆ పెళ్లి వేడుకలో వధువుకు అపురూప కానుక ఇచ్చి అంతా అవాక్కయ్యేలా చేశాడు. ఈ విచిత్ర సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగింది.

వడిచర్ల శ్రీనివాస్ అనే మండల స్థాయి నాయకుడు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కూతురు శివాని అంటే ప్రాణం. సోమవారం(మార్చి3) కూతురు వివాహం జరిగింది. అయితే ఆ వివాహ వేడుక సందర్భంగా తండ్రి కూతుర్ల అనుబంధం జీవితమంతా చెరగని జ్ఞాపకం ఉండాలని భావించిన మృతుడి కొడుకు కమలహాసన్ తన చెల్లెలికి ఓ అపురూప కానుక ఇచ్చాడు. ఆరడుగుల ఎత్తుతో తన తండ్రి శ్రీనివాస్ విగ్రహాన్ని తయారు చేయించిన కమలహాసన్ ఆ పెళ్లి వేడుకలో తన చెల్లెలికి కానుకగా ఇచ్చాడు. ఈ విగ్రహానికి తానే గుడి కట్టించి తండ్రిని జీవితమంతా దైవంలా పూజించాలని నిర్ణయించుకున్నారు.

పెళ్లి వేడుకలో అచ్చం తన తండ్రిని పోలిన విగ్రహాన్ని చూసిన వధువు శివాని బోరన విలపించింది. వధువుతో సహా అక్కడున్న వారంతా ఈ విచిత్ర సన్నివేశాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడ కనిపించని ఈ వినూత్న కానుక ఇక్కడ ఆ కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!