Dogs Attack: భాగ్యనగరంలో మరోసారి కుక్కల బీభత్సం.. బాలుడు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగిపై వీధి కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం

రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు.

Dogs Attack: భాగ్యనగరంలో మరోసారి కుక్కల బీభత్సం.. బాలుడు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగిపై వీధి కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం
Dog Control
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2023 | 6:34 AM

నిన్నగాక మొన్న ప్రదీప్‌ని పొట్టనపెట్టుకున్న కుక్కలు… గత కొద్దిరోజులుగా నగరంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క రోజే రెండో చోట్ల కుక్కలు జనంపై ఎటాక్‌ చేశాయి. కుక్కల వరుస దాడులకు పసిపిల్లలు బలౌతోన్న స్థితి తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కుక్కల దాడులతో పసిబిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు.

తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అత్తాపూర్ డివిజన్ తేజస్వి నగర్ కాలనీలో సన్‌రైజ్‌ టవర్స్ దగ్గర ఓ మూడేళ్ళ చిన్నారిని వదిలి…పిల్లాడి తల్లీతండ్రీ కూలి పనిలోకి వెళ్ళారు. రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు. కుక్కలు బాలుడిని తరుముకుంటూ వెంబడించాయి. పిల్లవాడి ఏడుపు విన్న స్థానికులు పరిగెత్తుకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కలను తరిమేసి, బాలుడిని కాపాడారు స్థానికులు.

మరోవైపు మేడ్చల్ జిల్లా… పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో కూడా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత మర్చిపోతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!