AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడే పుట్టిపెరిగా.. తెలంగాణ కోడల్ని, ప్రతీ గడపకీ వెళ్తా, నా స్థానికత ప్రశ్నించే హక్కు ఎవరికీలేదు: వైఎస్ షర్మిల

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్‌ లో ఇవాళ విద్యార్థులతో జరిపిన సమావేశంలో వైఎస్‌ షర్మిల భావోద్వేగంగా మాట్లాడారు. తన రాజకీయ పార్టీ ఆలోచనని వారితో పంచుకున్నారు.

ఇక్కడే పుట్టిపెరిగా.. తెలంగాణ కోడల్ని, ప్రతీ గడపకీ వెళ్తా, నా స్థానికత ప్రశ్నించే హక్కు ఎవరికీలేదు: వైఎస్ షర్మిల
Venkata Narayana
|

Updated on: Feb 24, 2021 | 8:29 PM

Share

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్‌ లో ఇవాళ విద్యార్థులతో జరిపిన సమావేశంలో వైఎస్‌ షర్మిల భావోద్వేగంగా మాట్లాడారు. తన రాజకీయ పార్టీ ఆలోచనని వారితో పంచుకున్నారు. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో వైఎస్‌ భరోసా కల్పించారన్నారు. ఆయన సాయంతో చదువుకుని స్థిరపడ్డవారంతా ఆయన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నారు. తెలంగాణలో ఇప్పటికీ ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్న షర్మిల.. అందరి నిరీక్షణ ఫలించాలంటే ఓ మంచి సమాజం రావాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా షర్మిల రాజకీయపార్టీ ఆలోచనని విద్యార్థులు స్వాగతించారు.

తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న వైఎస్‌ షర్మిల తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రయత్నాలతో పాటు అన్నతో అభిప్రాయభేదాలు, తెలంగాణ స్థానికత, భవిష్యత్‌ కార్యాచరణపై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మీడియా చిట్‌చాట్‌లో కీలక అంశాలపై స్పందించారు షర్మిల. గత ఆగస్టులోనే తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందన్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానన్నారు. పార్టీ జెండా, ఎజెండా సిద్ధమవుతోందన్నారు. తాను పార్టీపెట్టడం అన్నకు ఇష్టంలేదన్న షర్మిల…తన సంకల్పానికి తల్లి విజయమ్మ మద్దతుందని వెల్లడించారు. పార్టీలు వేరయినా, ప్రాంతాలు వేరయినా…అన్నాచెల్లెళ్లుగా తామొక్కటేనంటూ..తమ మధ్య విభేదాలు లేవని స్పష్టంచేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు షర్మిల.

తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న షర్మిల…తాను ఇక్కడి కోడలినేనని గుర్తుచేశారు. తెలంగాణకు తానెప్పుడో జై కొట్టానన్నారు. తాను పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనేని, తనకిష్టమైన సిటీ హైదరాబాద్‌ అని మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు షర్మిల. ఆ మాటకొస్తే సీఎం కేసీఆర్‌, విజయశాంతి ఒకప్పుడు ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చినవారేనన్నారు. షర్మిల పెట్టే పార్టీ ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుంది? ప్రజల మద్దతు ఎలా కూడగట్టుకుంటుంది అన్న ప్రశ్నలకు..చిట్‌చాట్‌లో తన ఆలోచనల్ని షేర్‌ చేసుకున్నారు వైఎస్‌ షర్మిల. ప్రత్యేక రాష్ట్రం సాధించాక తెలంగాణ ప్రజల సమస్యల తీరాయా అని ప్రశ్నించారు. ఆరేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న షర్మిల..అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి గడపల్లోకి వెళ్తానన్నారు.

Read also : ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్‌కి మనసును కదిలించే ఎండింగ్, బి ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ పై ఎన్నో అనుమానాలు