పాల సంద్రంలా.. పచ్చదనంగా ‘బొగత జలపాతం’..!
ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారింది బొగత జలపాతం. నాలుగైదు రోజులుగా కొండకోనల నుండి వరద హోరెత్తుతోంది. ములుగు జిల్లా వాడేడు మండలం సీకుపల్లి అడవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యటకులు భారీగా తరలివస్తూ.. ప్రకృతి మాత.. ఒడిలో సేదతీరుతున్నారు. అయితే.. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. టూరిస్టులను జలపాతం […]

ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారింది బొగత జలపాతం.
నాలుగైదు రోజులుగా కొండకోనల నుండి వరద హోరెత్తుతోంది. ములుగు జిల్లా వాడేడు మండలం సీకుపల్లి అడవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యటకులు భారీగా తరలివస్తూ.. ప్రకృతి మాత.. ఒడిలో సేదతీరుతున్నారు.
అయితే.. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. టూరిస్టులను జలపాతం ఎంతో కనువిందు చేస్తుంది. అయితే.. వరద ఉదృతి అధికంగా ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు అక్కడికి అనుమతించడంలేదు. వర్షాలు తగ్గిన తరువాత రమ్మని చెబుతున్నారు.