పబ్బులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం.. ఆల్ క్లోజ్..!

హైదరాబాద్‌లోని నిబంధనలు పాటించని పబ్‌లపై కొరడా ఝులిపించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు పాటించని పది పబ్బులను సీజ్ చేశారు. కొన్నింటికి ట్రేడ్ లైసెన్సులు లేవు, మరికొన్నింటికి బిల్డింగ్ పర్మిషన్లు లేవు. కొన్ని అయితే పర్మిషన్లు ఒకచోట ఉంటే.. పబ్బులు మరోచోట కొనసాగుతున్నాయి. దాదాపు 20 మంది జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. కొన్ని పబ్‌లు సీజ్ చేయగా, మరికొన్నింటికి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకుంటే సీజ్ చేస్తామని […]

పబ్బులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం.. ఆల్ క్లోజ్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2019 | 12:33 PM

హైదరాబాద్‌లోని నిబంధనలు పాటించని పబ్‌లపై కొరడా ఝులిపించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు పాటించని పది పబ్బులను సీజ్ చేశారు. కొన్నింటికి ట్రేడ్ లైసెన్సులు లేవు, మరికొన్నింటికి బిల్డింగ్ పర్మిషన్లు లేవు. కొన్ని అయితే పర్మిషన్లు ఒకచోట ఉంటే.. పబ్బులు మరోచోట కొనసాగుతున్నాయి. దాదాపు 20 మంది జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. కొన్ని పబ్‌లు సీజ్ చేయగా, మరికొన్నింటికి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జెన్, ఫెర్టీ కేఫ్, ది పెవీలియన్, జ్యూరీ, లావింటేజ్, జీరో 40 బ్రూవింగ్, కార్బేడియన్ నైట్ క్లబ్, బ్రాడ్ వే పబ్‌లను అధికారులు సీజ్ చేశారు. దశల వారీగా సరైన నిబంధనలు పాటించని పబ్‌లను మూసివేస్తామని హెచ్చరించారు.