AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

By Election: గెలుపే లక్ష్యం.. జూబ్లీహిల్స్‌లో వ్యూహం మార్చిన కమలదళం..!

హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై పోల్ కోసం అన్ని రాజకీయ పార్టీల కుస్తీ పడుతున్నాయి. కాషాయం పార్టీ సైతం కసరత్తు స్పీడప్ చేసింది. ఇప్పటికే కమిటీలు వేసి కాలనీల్లో బూత్ మీటింగ్స్ నడిపిస్తోంది. మానిటరింగ్ కమిటీతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ప్రచార వ్యూహాలు, టికెట్ రేసులో ఉన్నవారి పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది

By Election: గెలుపే లక్ష్యం.. జూబ్లీహిల్స్‌లో వ్యూహం మార్చిన కమలదళం..!
Bjp Chief Ramchandar Rao
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Sep 30, 2025 | 4:11 PM

Share

హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై పోల్ కోసం అన్ని రాజకీయ పార్టీల కుస్తీ పడుతున్నాయి. కాషాయం పార్టీ సైతం కసరత్తు స్పీడప్ చేసింది. ఇప్పటికే కమిటీలు వేసి కాలనీల్లో బూత్ మీటింగ్స్ నడిపిస్తోంది. మానిటరింగ్ కమిటీతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ప్రచార వ్యూహాలు, టికెట్ రేసులో ఉన్నవారి పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ బీజేపీ లేటెస్ట్ జూబ్లీహిల్స్ రూట్ మ్యాప్ ఎంటో తెలుసుకుందాం.

గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రా రెడ్డి, గౌతంరావులతో బై పోల్ కి మానిటరింగ్ కమిటీ వేసింది అధిష్టానం. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పార్టీ తరుపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని చాపకింద నీరులా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాషాయ దళం క్యాంపెయినింగ్ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, ఇక ముందు అనుసరించాల్సిన వ్యూహాలపై మానిటరింగ్ కమిటీతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచందర్ రావు అత్యవసర భేటి అయ్యారు. బూత్ లెవల్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాుల చేపట్టాలని సూచించారు.

జూబ్లీహిల్స్ ఓటర్ నాడీ తెలుసుకుని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ తరపున అభ్యర్థి ఎవరన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. టికెట్ కావాలంటూ ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన వినతులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి తనకే మళ్లీ అవకాశం ఉంటుందన్న గట్టి ధీమాతో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో ఆయనే చూసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ తనకే ఉంటుందని, టికెట్ పక్కా లంకలకే అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

మరోవైపు జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి తర్వాత బలంగా వినిపిస్తున్న పేర్లు కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ. ఈ ముగ్గురు మహిళా కోటాలో తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కీర్తిరెడ్డి గతంలోనూ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కిషన్ రెడ్డి అనుచర వర్గం కావడం, ఆర్థికంగా బలంగా ఉండటం, మహిళా కేటగిరీ ఆమెకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆమె తన మనసులోని మాట రాష్ట్ర నాయకత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది.

టికెట్ ఆశిస్తున్న మరో మహిళా నేత ఆకుల విజయ. రాష్ట్రంలో బీసీ చూట్టే రాజకీయం నడుస్తున్న వేళ జూబ్లీహిల్స్‌లో బీసీలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆకుల విజయ బీసీ మహిళ. గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేయడం, రాష్ట్ర నేతల్లో కొద్దిమంది మద్దతు ఉండటంతో టికెట్ ఇస్తారన్న ఆశలు పెట్టుకున్నారు. అధికార కాంగ్రెస్ బీసీని బరిలోకి దించాలని చూస్తోందని.. బీజేపీ నుంచి కూడా బీసీనైన తనకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరో బీజేపీ మహిళా నేత వీరపనేని పద్మ కూడా టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు.

మొత్తంగా ఓ వైపు జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమలం పార్టీ.. గెలుపు గుర్రంగా ఎవరిని బరిలోకి దించుతుందన్న ఆసక్తి కంటిన్యూ అవుతోంది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us