Tarun Chugh – Telangana: వరంగల్ పర్యటనలో తరుణ్ చుగ్.. దళిత కార్యకర్త పాదాలకు నమస్కారం..
Tarun Chugh - Telangana: 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజీపీ దూకుడు పెంచింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేతలు..
Tarun Chugh – Telangana: 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజీపీ దూకుడు పెంచింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేతలు.. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. మరోవైపు, రాష్ట్రంపై దండయాత్రకు దిగినట్లుగా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సహా, బీజేపీ అగ్రనేతలు అంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు.
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న తరుణ్ చుగ్.. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగామ జిల్లాలోని చిలుపూరు మండలం చిన్నపెండ్యాలలోదళిత కార్యకర్త, బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాణాలు శ్రీనివాస్ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. వారితో కాసేపు మాట్లాడి.. వారి సాదకబాదకాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో నేతలతో భేటీ.. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరిన తరుణ్ చుగ్.. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. అదే విధంగా ఆదివారం ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశంకానున్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం సహా హైదరాబాద్ నేతలతో సమీక్ష చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్న చుగ్ అదేరోజు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
అధికారికంగా విమోచన దినోత్సవం.. కేంద్ర ప్రభుత్వం విమోచనా దినోత్వసాన్ని అధికారికంగా నిర్వహించాలని… కేంద్ర బలగాలతో పరేడ్ కూడా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ స్టేట్‌లోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లో విలీనం కావడంతో అక్కడి ముఖ్యమంత్రులను కూడా అహ్వానించారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖలు కూడా పంపారు. దీంతో బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా విమోచనా దినోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ వెంటనే దేశంలో విలీనం కాలేదు. కొన్నాళ్ల తర్వాత భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టడంతో నిజాం తెలంగాణను విడిచి వెళ్లిపోయారు. దాంతో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది.
సీఎం కేసీఆర్‌పై ఫైర్.. ఇదిలాఉంటే, తరుణ్ చుగ్.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రధాని మోదీ గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ కనీస పరిణీతి చూపించడం లేదని విమర్శించారు. బీజేపీ ముక్త్ భారత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నందుకే కేసీఆర్‌కు మోదీ నచ్చడం లేదేమో అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ చేయాలని నిర్ణయించుకున్నారని, 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం ఖాయం అని వ్యాఖ్యానించారు తరుణ్ చుగ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..