AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Side Love Success Tips: వన్ సైడ్ లవ్‌లో ఉన్నారా? ఇలా మీ ప్రేమను సక్సెస్ చేసుకోండి..

One Side Love Success Tips: ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు.

One Side Love Success Tips: వన్ సైడ్ లవ్‌లో ఉన్నారా? ఇలా మీ ప్రేమను సక్సెస్ చేసుకోండి..
Untitled 6
Shiva Prajapati
|

Updated on: Sep 01, 2022 | 10:03 PM

Share

One Side Love Success Tips: ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 ఏళ్ల బాలిక నాలుగైదు రోజులుగా జీవన్మరణంతో పోరాడుతోందని, ఆమె శరీరంలో మూడో బుల్లెట్ ఇంకా ఉందని వైద్యులు తెలిపారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు కారణం వన్ సైడ్ లవ్. ఏకపక్షంగా ప్రేమించడం.. ఎదుటివారి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోవడం, వారు కాదంటే క్షణికావేశానికి లోనై దాడులు చేయడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఎదుటి వారి ఇష్టాయిష్టాలతో పని లేకుండా పిచ్చిగా ప్రేమించడం, కాదంటే సహించలేక చంపేయడం వంటివి సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. అయితే, వన్‌సైడ్ లవ్ రిజెక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది. తిరస్కరణను సహించలేని ప్రేమికులు.. తాము ప్రేమిస్తున్న వారిని ఏం చేయడానికైనా వెనుకాడని మానసిక స్థితికి దిగజారిపోతారు. వీరు మానసికంగా చాలా క్షీణిస్తారు. వీరు తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు గురైన వీరు.. క్షణికావేశంలో తప్పుడు చర్యలకు పాల్పడుతారు.

వన్‌సైడ్ లవ్ సక్సెస్ టిప్స్..

అయితే, ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు మానసిక నిపుణులు. వీటిని పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఎదుటి వారి ప్రేమను ఆవేశంతో కాదు, ప్రేమతో పొందాలని సూచిస్తున్నారు. అందుకు అవసరమైన చిట్కాలను కూడా సూచించారు. మరి వన్ సైడ్ లవ్ ట్రాజెడీ కాకుండా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

1. మీరు ఇష్టపడుతున్న, ప్రేమిస్తున్న వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. ఆమెకు ప్రపోజ్ చేయడంలో తొందరపాటు కారణంగా ఆ సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. దానికి బదులుగా వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుచుకోండి. వారితో మీ సాన్నిహిత్యాన్ని మరింత పెరిగేలా చూసుకోవాలి. 2. మీరు ప్రేమిస్తున్న వారిపై ఎన్నడూ కోపగించుకోవద్దు. పదే పదే కోపగించుకుంటే.. వారు మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. 3. మీ ప్రేమను వారికి వ్యక్తపరచాలంటే.. ముందు మీరు వారికి టచ్‌లో ఉండాలి. అలాగే, అన్ని వేళలా ప్రత్యేకంగా అనిపించేలా చేయాలి. మధ్య మధ్యలో మీరు ప్రేమించిన వారికి నచ్చిన పనులను చేస్తూ ఉండాలి.

అనుకోకుండా ప్రేమ భావాలు చిగురిస్తే..

మనసులోని మాట పంచుకోండి: తమలో అనాలోచిత ప్రేమ చిగురించినట్లయితే.. అలాంటి వారు తమను తాము ఎలా ఎదుర్కోవాలో కూడా నిపుణులు చిట్కాలు తెలిపారు. మనసులోని భావాలను పంచుకోవడం ద్వారా ఈ ఆలోచనలను నియంత్రించవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీరు ఇతరులతో మనసువిప్పి మాట్లాడాలి. తమ భావోద్వేగాలను పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలిక అవుతుంది.

సంగీతం వినాలి: సంగీతం వినడం వల్ల హృదయం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. వన్ సైడ్ ప్రేమికులు తాము ఇష్టపడే, మనస్సు ప్రశాంతంగా ఉండే పాలను వినాలి. లవ్, బ్రేకప్ లాంటి పాటలను పొరపాటున కూడా వినవద్దు. ఇవి మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి.

సోలో ట్రిప్: ట్రావెలింగ్ అనేది ఒక రకమైన ధ్యానం. ఇది మన హృదయాన్ని, మనస్సును నిమిషాల్లోనే రిఫ్రెష్‌గా మార్చేస్తుంది. వన్ సైడ్ లవ్ ఎవరినైనా మానసిక ఆరోగ్యం క్షీణించే రోగిని చేస్తుంది. వారు డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. అలాంటివారు బ్యాగులు సర్దుకుని ఒంటరిగా యాత్రకు వెళ్లాలి. ఈ విధంగా కాలం గడిపితే.. మిమ్మల్ని కలవరపరిచే జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండొచ్చు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..