Etela Rajender: ఆయనది మైండ్ గేమ్.. వైఎస్ హయాంలో కూడా ఇలానే చేశారన్న ఈటల..
తనను డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ మైండ్ గేమ్‌తోనే అలా మాట్లాడారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇక అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదే పదే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. తనను డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ మైండ్ గేమ్‌తోనే అలా మాట్లాడారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇక అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందించారు. తనపై చేసిన దాడులు, వేధింపుల్ని మర్చిపోలేదన్నారు. ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ ప్లాన్‌లో భాగమే అని విమర్శించారు. షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఇలాంటి వార్తలు వేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ చిల్లర ప్రచారాలు మాత్రమే అని కొట్టిపారేశారు.
ఇప్పటికిప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునేందుకే ఇలా మాట్లాడి ఉండవచ్చన్నారు. నేను బీజేపీ సైనికుడిని.. నిమిషానికో మాట మాట్లాడను. నాపై ఉన్న నమ్మకంతోనే హుజూరాబాద్ ప్రజలు గెలిపించారు. బీఆర్ఎస్ వెళ్లగొడితేనే నేను పార్టీ మారాను. అంతే కానీ పార్టీ మారే సంస్కృతి నాది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక వేళ బీఆర్ఎస్ నన్ను ఆహ్వానించినా వెళ్లనంటూ కుండ బద్దలు కొట్టారు ఈటల రాజేందర్.
వైఎస్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని.. తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోనంట ఈటల సూటిగా స్పందించారు. టీఆర్ఎస్‌లో సైనికుడిగా పనిచేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానంటూ వెల్లడించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
తెలంగాణ అసెంబ్లీలో సుమారు 2 గంటల ప్రసంగంలో 10 సార్లుకు పైగా ఈటెల ప్రస్తావన తీశారు సీఎం కేసీఆర్. పదే పదే మిత్రుడు ఈటెల రాజేందర్ చెప్పినట్టు అనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈటెల పేరు ప్రస్తావించే సమయంలో పదే పదే ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈటల రాజేందర్ అనేక విషయాలను ప్రస్తావించారన్నారు. వాటిని స్వాగతిస్తామని, వాటిపై చర్చిస్తామని కేసీఆర్ చెప్పారు. ఆయన అడిగిన డిమాండ్లను తీర్చాలంటూ మంత్రులకు కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ శైలితో ఈటల తిరిగి పార్టీలో చేరుతారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం