- Telugu News Photo Gallery Spiritual photos Samatha Kumbh Brahmotsavam photos on 12 02 2023 in Hyderabad Telugu spiritual Photos
Samatha kumbh 2023: అంగరంగ వైభవంగా సాగిన శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు.. 10వ రోజు ఫొటోస్
శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. సమతా కుంబ్ 2023 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముచింతల్ శ్రీరామ నగరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది.
Anil kumar poka | Edited By: Ram Naramaneni
Updated on: Feb 12, 2023 | 7:04 PM

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. వేలాది మందితో చేపట్టిన విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో సాగింది

సమతా కుంబ్ 2023 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముచింతల్ శ్రీరామ నగరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం శ్రీ చినజీయర్‌స్వామి, దేవనాథస్వామి, రామచంద్ర రామానుజ జీయర్, అహోబిలం జీయర్‌ల ఆధ్వర్యంలో విశ్వశాంతి విరాట్ గీతాపారాయణకార్యక్రమం జరిగింది.

వేల సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పారాయణం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ భగవద్గీతను భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారని, భగవద్గీతను పారాయణం చేస్తే భగవంతుడిని ప్రార్థించినట్టే అని చినజీయర్ స్వామి అన్నారు.

రామానుజుల వారి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయడం మనందరి అదృష్టమని, అంతేకాకుండా రామానుజుల వవారి సమతా స్పూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సమాజంలో అసమానతలు, కుల, మత, లింగ బేధాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని భక్తులకు చెప్పారు. : శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

భగవద్గీత పారాయణం పూర్తయిన తర్వాత చిన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు...గీత నేర్చుకోవడానికి యోగ్యతలు అక్కర్లేదని .. మనిషి అయితే చాలని,భగవద్గీత మత గ్రంథం కాదని .. మానవత్వాన్ని నేర్పే గ్రంథమని చిన జీయర్ స్వామి అన్నారు.

భగవద్గీత సాంప్రదాయక గ్రంథం కాదని,సమాజాన్ని నిర్మించే గ్రంథంఅన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి మార్గాన్ని చూపించేదని చిన జీయర్ తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి

TV9 తెలుగు ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మాట్లాడుతూ చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్ అవార్డు రావడం ఆయన ఆధ్యాత్మిక సేవకు గుర్తింపు అన్నారు..: రజనీకాంత్ - Tv9 మేనేజింగ్ ఎడిటర్

కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మాట్లాడుతూ ఈ స్థలం ఎంతో పవిత్ర మైనదని, చిన జీయర్ స్వామి ఆశీస్సులు పొందడం మన అదృష్టమని కేంద్ర మంత్రి భగవత్ ఖుబా అన్నారు.

రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.





























