Telangana: త్వరలో కవిత కూడా జైలుకే.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.. వివేక్ వెంకటస్వామి ఫైర్..

దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతటి సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఈ కేసులో చాలా మంది పొలిటీషియన్స్, ప్రముఖుల పేర్లు బయటపడటం కలకలం రేపింది. బీఆర్ఎస్...

Telangana: త్వరలో కవిత కూడా జైలుకే.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.. వివేక్ వెంకటస్వామి ఫైర్..
Vivek Venkataswamy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 27, 2023 | 4:13 PM

దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతటి సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఈ కేసులో చాలా మంది పొలిటీషియన్స్, ప్రముఖుల పేర్లు బయటపడటం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బీజేపీ లీడర్ వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా లాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనూ సీబీఐ త్వరలోనే అరెస్టు చేస్తుందని అన్నారు. లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు వేగంగా జరుగుతోందన్న ఆయన..ఢిల్లీ, పంజాబ్ లో కాకుండా దేశమంతా లిక్కర్ స్కాం చేయాలనుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకున్నారని వివేక్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి డబ్బులతో దేశమంతా తిరుగుతున్నారని, బీఆర్ఎస్ పేరిట కార్యకలాపాలు ప్రారంభించారని వివేక్ వెంకటస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చింది. ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి.. రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారు. దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ నిధులున్న పార్టీ బీఆర్ఎస్. ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలంటూ రూ.400 కోట్లతో విమానం కొన్నారు.

       – వివేక్ వెంకటస్వామి, బీజేపీ లీడర్

ఇవి కూడా చదవండి

కాగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు సీబీఐ అధికారులు. రౌస్‌ అవెన్యూ కోర్టులో సిసోడియాను హాజరుపరచనున్న సీబీఐ..మరికొంతకాలం కస్టడీకి కోరనుంది. మరోవైపు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైద్యుల బృందం..సిసోడియాకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. చాలా మంది సీబీఐ అధికారులే సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకించారన్న కేజ్రీవాల్‌..సిసోడియా అరెస్ట్‌ చేయాలని సీబీఐపై ఒత్తిడి తెచ్చారంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి