Telangana: మరో దారుణం.. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో యువతి ఆత్మహత్య.
ఇటీవల జరుగుతోన్న పరిణామాలు తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న యువతులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణం ఏదైనా, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా..
ఇటీవల జరుగుతోన్న పరిణామాలు తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న యువతులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణం ఏదైనా, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా దేవుడిచ్చిన జీవితానికి బలవంతంగా ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారం ఇంకా మరిచిపోకముందే మరో దారుణం జరిగింది. అదే వరంగల్ జిల్లాకు చెందిన మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుడి మోసం చేశాడన్న కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది.
వివరాల్లోకి వెళితే.. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ కి చెందిన పోగుల ఉషారాణి అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య వేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు ప్రేమించి మోసం చేశాడని మనస్తాపం చెందిన యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఉషారాణి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అనంతరం డెడ్ బాడీని హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..