AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Preethi: అనంతలోకాలకు తండా బిడ్డ.. ఆమె కుటుంబానికి మొత్తం ఎంత పరిహారం అందనుందంటే

తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదు. హత్యేనని, ప్రీతి తండ్రి నరేందర్‌ ఆరోపించారు. బిడ్డ మృతితో శోకసంద్రంలో ఉన్న ఆయన.. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారన్నారని.. అదే కోణంలో పోలీసులు విచారణ చేయాలని కోరారు.

Medico Preethi: అనంతలోకాలకు తండా బిడ్డ.. ఆమె కుటుంబానికి మొత్తం ఎంత పరిహారం అందనుందంటే
Preethi
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2023 | 3:23 PM

Share

మెడికో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు ఓయూ జేఏసీ నేతలు. ఈ ఎపిసోడ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ప్రీతి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు. ప్రీతి డెత్‌ వెనుక ఎవరున్నారో సమగ్రవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారామె.

ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

మారుమూలతండా నుంచి వచ్చి డాక్టర్ అయ్యి భవిష్యత్‌లో ఎందరికో వైద్య సేవలు అందిస్తుంది అని భావించిన ప్రీతి అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడింది.   అశ్రునయనాల మధ్య మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం జనగామ జిల్లా గిర్నితండాలో జరిగిన అంత్యక్రియలకు ఊరు ఊరంతా తరలివచ్చింది. ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఇక ప్రీతి తల్లిదండ్రుల్ని ఓదార్చడం అక్కడున్న వారి వల్ల కాలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ అర్ధంతరంగా వీడి వెళ్లిందంటూ గుండెపగిలేలా ఏడ్చారు. మరోవైపు ప్రీతి చావుకి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని.. కఠినంగా శిక్షించాలని నినదించాయి గిరిజన సంఘాలు.

ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేర్వేరు పార్టీల నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి అంత్యక్రియలతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి.. ఆదివారం రాత్రి 9. 10 గం.లకు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. డెత్‌ సర్టిఫికెట్‌పై సంతకం చేసేందుకు కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు గిరిజన, విద్యార్థి సంఘాల రాకతో నిమ్స్ పరిసరాల్లో నిన్న రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టెన్షన్‌ పరిస్థితుల మధ్య పోస్టుమార్టం జరిగింది. అనంతరం స్వగ్రామం గిర్నితండాకు ప్రీతి మృతదేహాన్ని తరలించారు. ప్రీతి డెడ్‌బాడీని చూసి గ్రామస్థులంతా భోరుమన్నారు. అన్యాయంగా బిడ్డను బలితీసుకున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం ప్రీతి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులంతా ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు.

మొత్తం 30 లక్షల పరిహారం

ప్రీతి ఫ్యామిలీకి రూ.30 లక్షల పరిహారం అందనుంది. గవర్నమెంట్ రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ప్రీతి తండ్రి వెల్లడించారు.  అలాగే  ఫ్యామిలీలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని, అంతేకాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. HOD, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి