రాజన్న రాజ్యంలో దోచుకోవడం, దాచుకోవడమే.. షర్మిల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
సంకల్ప సభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందించారు. షర్మిలపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మూకుమ్మడిగా విమర్శ బాణం ఎక్కుపెట్టారు.
nvss prabhakar counter on ys sharmila: సంకల్ప సభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందించారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరడం లేదని విమర్శించిన షర్మిల.. నియామకాల కోసం నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఉచిత విద్య, కేజీ టూ పీజీ, డబుల్‌బెడ్‌రూంలు, 12 శాతం రిజర్వేషన్లు, మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించిన ఆమె.. అభివృద్ది ఫలాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయన్నారు. పేద వాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అన్నారు.
షర్మిల వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మూకుమ్మడిగా విమర్శ బాణం ఎక్కుపెట్టారు. షర్మిల పొలిటికల్ ఎంట్రీ వెనుక యహోవ రాజ్యం తెద్దామన్న కుట్ర దాగి ఉందని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇందుకు తెరపైకి 12 పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని బూచిగా చూపించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకు విజయమ్మ కూడా అండగా నిలవడాన్ని ఎన్వీఎస్‌ఎస్ తప్పుపట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా ఆరోపించగా.. షర్మిల వ్యాఖ్యల వెనుక యహొవ రాజ్యం తెచ్చే కుట్ర సాగుతోందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. రాజన్న రాజ్యం అవసరం లేదని చెబుతూనే. రాజన్న రాజ్యంలో దోచుకోవడం, దాచుకోవడమే. రాజన్న రాజ్యంలో ఇప్పటికి అధికారులు జైల్ చుట్టు తిరుగుతున్నారు. రాజన్న రాజ్యంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు. షర్మిల అన్న ఏపీ ముఖ్యమంత్రి ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలను చీల్చిన చరిత్ర కూడా రాజన్న రాజ్యంలో ఉందని గుర్తు చేసిన ప్రభాకర్.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన షర్మిలపై పోలీసులు కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also… వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఫైర్.. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టొద్దని వార్నింగ్