Kidnap Case: భాగ్యనగరంలో కిడ్నాప్ కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల అదృశ్యం..
Vanasthalipuram Kidnap Case: హైదరాబాద్‌లో బాలికల కిడ్నాప్ సంఘటన కలకలం సృష్టించింది. నగర శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
Vanasthalipuram Kidnap Case: హైదరాబాద్‌లో బాలికల కిడ్నాప్ సంఘటన కలకలం సృష్టించింది. నగర శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజిల్‌లోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి నగర్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి తమ కూతుళ్లు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్ (14) కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రగతినగర్‌కు చెందిన రమేశ్, అతని స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు బాధిత బందువులు ఆరోపించారు. గతంలో ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని రమేశ్ వెంటపడుతుండటంతో పలుమార్లు హెచ్చరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read: