థియేటర్ వద్ద ఘర్షణ… కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 9)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

Vakeel Saab movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 9)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండితెరపై చేసినందుకు అభిమానుల్లో ఆనందం ఆకాశాన్ని తాకింది. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సమయంలో అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు . దాంతో అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు ఆసమయంలో తొక్కిసలాట కూడా జరిగింది. ఇక శుక్రవారం సినిమా రిలీజ్ సమయంలో బెనిఫిట్ షో ఆలస్యం అవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కొన్ని చోట్ల థియేటర్స్ పైన దాడికి పాల్పడ్డారు. కుర్చీలు , గేట్లు విరగ్గొట్టారు. థియేటర్స్ పై రాళ్లవర్షం కురిపించారు.
తాజాగా విశాఖపట్నం జిల్లాలోని నార్పలలో కానిస్టేబుల్ పై పవన్ కళ్యాణ్ అభిమాని కత్తితో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నార్పలలోని శ్రీనివాస థియేటర్ వద్ద వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శన సమయంలో యువకుల మధ్య గొడవ జరిగింది.ఈ ఘర్షణను ను అదుపు చేయడానికి వెళ్ళిన గౌస్ అనే కానిస్టేబుల్ పై పవన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Vakeel Saab
మరిన్ని ఇక్కడ చదవండి :
Pawan Kalyan’s Vakeel Saab: వకీల్‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…
Vakeel Saab: ‘వకీల్ సాబ్’కు మళ్లీ షాక్.. టికెట్ ధరలపై మరోసారి హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం.!
Vakeel Saab: వకీల్ సాబ్ పై ఆచార్య ప్రశంసలు .. తనదైన స్టైల్ లో పవన్ సినిమాకు రివ్యూ ఇచ్చిన మెగాస్టార్




