Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అశ్లీల చిత్రాల పోస్ట్..

Twitter Account Hacked: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అనంతరం హ్యాకర్లు

Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అశ్లీల చిత్రాల పోస్ట్..
Mekapati Goutham Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2021 | 1:05 PM

Twitter Account Hacked: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అనంతరం హ్యాకర్లు గౌతమ్ రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గౌతమ్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తన ట్విటర్‌ను హ్యాక్ చేశారని, అసంబద్ద పోస్టులు పెడుతున్నారని గౌతమ్ రెడ్డి ట్విట్ చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని.. అలాంటి పోస్టులను పట్టించుకోవద్దంటూ ఫాలోవర్లను గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై ట్విట్టర్ సంస్థకు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ అసౌకర్యానికి ఆయన తన అకౌంట్ ఫాలో అవుతున్న వారికి క్షమాపణలు తెలియజేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఎవరు గౌతమ్ రెడ్డి ట్విట్టర్ హ్యాక్ చేసి ఉంటారు. ఎక్కడ నుంచి హ్యాక్ అయింది అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన ట్వీట్..

Also Read:

Jabardasth Fame Vinod:మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం

Oldage Couple Sucide: కుమారులు పట్టించుకోవడం లేదంటూ.. వృద్ధ దంపతుల బలవన్మరణం..